News October 15, 2024
ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం
ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఇక నుంచి వారు జిల్లా కార్యకలాపాల్లో భాగస్వామ్యం కానున్నారు.
Similar News
News November 11, 2024
విజయనగరం MLAలు ఏం చేస్తారో..!
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి విజయనగరం ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, తోటపల్లి ఎత్తిపోతల పథకం కాలువ పనులు, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.
News November 11, 2024
VZM: ‘యువ న్యాయవాదులదే ఆ బాధ్యత’
రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ లేని విధంగా విజయనగరం జిల్లా కోర్టుకు ఆధునిక వసతులతో కూడిన నూతన భవన సమూహం మంజూరయ్యాయని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కృతజ్ఞతా పూర్వక అభినందన సభ నిర్వహించారు. ముఖ్యంగా యువ న్యాయవాదులే ఈ భవనాల్లో న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేయనున్నందున వారిపైనే భవనాల నిర్మాణం, నిర్వహణ బాధ్యత అధికంగా ఉంటుందన్నారు.
News November 10, 2024
కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ రద్దు: విజయనగరం కలెక్టర్
విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లా ప్రజలంతా ఈ విషయాన్ని గమనించాలని కోరారు.