News August 29, 2024
‘ఉమ్మడి విజయనగరం జిల్లాకు జ్వరమొచ్చింది’
విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వరపీడితులతో కిక్కిరిసాయి. గడిచిన కొన్ని రోజుల నుంచి ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. సీహెచ్సీలలో రోజుకు 400 వరుకు ఓపీలు, పీహెచ్సీల్లో సుమారు 200 వరుకు ఓపీలు నమోదవుతున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై వరుకు 435 మలేరియా,94 డెంగీ కేసులు నమోదయ్యాయి. క్షేత్ర స్థాయిల్లో వసతుల లేమితో రోగులు అవస్థలు పడుతున్నారు.
Similar News
News September 19, 2024
మంత్రి లోకేశ్‌తో జిల్లా ప్రజా ప్రతినిధులు భేటీ
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ సమావేశంలో మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, అదితి గజపతి, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్సీ చిరంజీవి, తదితరులు నారా లోకేష్ తో భేటీ అయ్యి కాసేపు మాట్లాడారు. నియోజకవర్గాల తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు.
News September 18, 2024
భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి పేరు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేస్తూ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. విమానాశ్రయానికి అల్లూరి పేరును నామకరణం చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News September 18, 2024
ఉమ్మడి జిల్లాలో రేపు రెండు అన్న కాంటీన్లు ప్రారంభం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా 75 అన్న కాంటీన్లను గురువారం ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు క్యాంటీన్ల ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలోని జీజే కళాశాల పక్కన.. అలాగే బొబ్బిలిలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో అన్న కాంటీన్లు ప్రారంభం కానున్నాయి.