News March 7, 2025

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 21 లోక్ అదాలత్ బెంచీలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం తెలిపారు. రెండు జిల్లాల్లో మొత్తం 21 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ ప్రమాద బీమా, బ్యాంకు చెక్ బౌన్స్, ప్రాంసరీ, ఎలక్ట్రిసిటీ, ఎక్సైజ్, ల్యాండ్, తదితర కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.

Similar News

News March 8, 2026

VZM: కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని 26 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా. ఎ. రామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్త ప్రవేశాలు ఉండగా, 7 నుంచి 10, ఇంటర్‌లోని తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నామన్నారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News March 8, 2026

పోలీస్ పరేడ్‌లో మహిళ దినోత్సవం: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం పోలీస్ పరేడ్‌లో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిపాలన యంత్రాంగం, డీఆర్‌డీఏ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానిస్తామన్నారు.