News April 8, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లావాసులకు అలెర్ట్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈరోజు పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరంలోని 20 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Similar News

News November 2, 2024

పార్వతీపురం: తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య

image

తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. తూడి గ్రామానికి చెందిన కొనిశ శివ(27) తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిందని రైల్వే HC దేశాబత్తుల రత్నకుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News November 2, 2024

పార్వతీపురం: ఈ నెల 6 నుంచి కంటి వెలుగు పరీక్షలు

image

పార్వతీపురం జిల్లాలో కంటి వెలుగు కింద చేపడుతున్న దృష్టి లోపం నిర్దారణ పరీక్షలను ఈ నెల 6 నుంచి నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇందుకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ రూపొందించిన ముందస్తు ప్రణాళికను ఎంపీడీఓలకు వివరించారు. ముందుగా సీతంపేట, గుమలక్ష్మిపురం, సాలూరు, పాచిపెంట, జియమ్మవలస, కొమరాడ మండలాల్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయాల్లో నవంబర్ 6 నుంచి నిర్వహించాలన్నారు.

News November 2, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం

image

పార్వతీపురంలోని రైలు పట్టాలపై రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. జీఆర్పీ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో ఒకరు మృతి చెందగా, కూత వేటు దూరంలో మరొకరు మృతి చెందారు. ఒకే ప్రాంతంలో ఇద్దరు మృతి చెందడంపై పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.