News April 21, 2025

ఉమ్మడి విశాఖలో కేటగిరీల వారీగా డీఎస్సీ పోస్టులు ఇలా..

image

డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాలో 734 పోస్టులు భర్తీ చేయనున్నారు. రోస్టర్ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. OC- 290, BC-A: 53, BC-B: 73, BC-C:7, BC-D:49, BC-E:29, SC గ్రేడ్1- 13, SC గ్రేడ్2- 44, SC గ్రేడ్3- 60, ST- 43, EWS- 73 పోస్టులు కేటాయించారు.

Similar News

News April 22, 2025

K.G.Hలో టీచర్లకు వైద్య శిబిరాలు 

image

బదిలీల్లో ప్రాధాన్యత క్యాటగిరీ కిందకు వచ్చే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 24 నుంచి 26 వరకు K.G.Hలో ప్రత్యేక వైద్య శిబిరానికి హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ కోరారు.‌ 24న విశాఖ, 25న అనకాపల్లి, 26న అల్లూరి జిల్లాలకు చెందినవారు వైద్య శిబిరాలకు హాజరు కావాలన్నారు. ఈ శిబిరంలో పొందిన సర్టిఫికెట్ల ఆధారంగా కేటగిరీలను వర్గీకరిస్తామని తెలిపారు.

News April 21, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 113 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 113 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. ప్రజలు నుంచి నేరుగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులు ఫిర్యాదులను పరిశీలించి అర్జీదారులతో స్వయంగా మాట్లాడాలని ఆదేశించారు. ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని చట్టపరంగా సమస్య పరిష్కారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు.

News April 21, 2025

V.M.R.D.Aకు ఇన్‌ఛార్జ్ కమిషనర్ 

image

V.M.R.D.A. మెట్రోపాలిటన్ కమిషనర్ K.S. విశ్వనాథన్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (M.M.R.D.A.) కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు సోమవారం ముంబై వెళ్లారు. 22వ తేదీన కూడా ఆయన అధ్యయనం ముంబైలో ఉంటారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌ని ఇన్ ఛార్జ్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

error: Content is protected !!