News June 4, 2024

ఉమ్మడి విశాఖలో గెలిచింది వీరే

image

⁍ విశాఖ(E): వెలగపూడి(TDP), విశాఖ(W):గణబాబు(TDP)
⁍ విశాఖ(N): విష్ణుకుమార్(BJP), విశాఖ(S): వంశీకృష్ణ(JSP)
⁍ భీమిలి: గంటా(TDP), గాజువాక: పల్లా శ్రీను(TDP)
⁍ పెందుర్తి: పంచకర్ల(JSP),యలమంచిలి:సుందరపు(JSP)
⁍ చోడవరం:KSNS రాజు(TDP), అనకాపల్లి: కొణతాల(JSP)
⁍ మాడుగుల: బండారు(TDP),నర్సీపట్నం: అయ్యన్నపాత్రుడు(TDP)
⁍ పాయకరావుపేట: అనిత(TDP)
⁍ అరకు: మత్స్యలింగం(YCP)
⁍ పాడేరు: విశ్వేశ్వరరాజు(YCP)

Similar News

News November 9, 2025

మల్కాపురంలో యువకుడి మృతి

image

మల్కాపురంలోని ఓ బార్‌లో పనిచేసే యువకుడు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి మల్కాపురంలోని బార్‌లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి బార్‌ వద్ద మృతి చెందినట్లు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 8, 2025

విశాఖ: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

image

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి మీ నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ.14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులుగా కృష్ణా జిల్లాకు చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను శనివారం అరెస్ట్ చేశామన్నారు.

News November 8, 2025

విశాఖ: నిర్మాణాల వద్ద వాలిపోతున్న చోటా నేతలు

image

సొంత ఇంటి నిర్మాణం మధ్యతరగతి కుటుంబాల కల. విశాఖలో కొందరు చోటా నాయకులు తమ ఆగడాలతో సామాన్యుల కలను చిదిమేస్తున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే GVMCకి ఫీజులు చెల్లించి, టౌన్ ప్లానింగ్ అనుమతి తీసుకుంటే చాలు. కానీ ఈ నాయకులు ప్రజల నుంచి ముడుపులు వసూలు చేస్తుండటంతో.. ఈ వేధింపులు తాళలేక ఇటీవల ఓ ఇంటి యజమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. నగరంలో వీరి ఆగడాలకు చెక్ పెట్టాలని బాధితులు కోరుతున్నారు.