News January 4, 2025

ఉమ్మడి విశాఖలో పలువురికి పదోన్నతులు

image

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నలుగురు ఏ.ఎస్.ఐలను ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఏఎస్ఐలుగా పనిచేస్తున్న టి.అర్జునరావు, ఎస్.శేషగిరిరావు, ఎస్.సన్యాసిరావులను అనకాపల్లి జిల్లాకు, జె.శంకరరావును అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఎస్ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News December 6, 2025

విశాఖ: రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖలో 12 రైతు బజార్లలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శనివారం తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ నుంచి ఖాళీ అవుతున్న 25 డ్వాక్రా మహిళలు, ఆరు PHC స్టాల్స్‌కు డిసెంబర్ 7 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను గోపాలపట్నం మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో అందజేయాలి.

News December 6, 2025

విశాఖలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంఖుస్థాపన

image

విశాఖ తూర్పు నియోజకవర్గం ముడసర్లోవలో రూ.62 కోట్లతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు ఎంపీ శ్రీభరత్, విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి శంఖుస్థాపన చేశారు. రాష్ట్రానికి మంజూరైన 5 హాస్టళ్లలో 3 విశాఖకే దక్కడం విశేషం. సీఎం చంద్రబాబు కృషి, కేంద్ర నిధుల సద్వినియోగంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని విప్ చిరంజీవిరావు తెలిపారు. ఈ ఐదంతస్తుల భవనం ఉద్యోగినులకు సురక్షిత వసతిని అందిస్తుందన్నారు.

News December 6, 2025

విశాఖ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల కష్టాలు

image

విశాఖ విమానాశ్రయంలోనూ అయ్యప్ప స్వాములు అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా చుక్కలు చూపిస్తున్న ఇండిగో సర్వీసులు శనివారం కూడా రుద్దయ్యాయి. శబరిమల వెళ్లేందుకు నగరం నుంచి చాలామంది ముందుగానే విమాన టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా అన్ని సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రయాణికులకు మెసేజ్‌లు పంపింది. దీంతో స్వాములు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.