News January 4, 2025

ఉమ్మడి విశాఖలో పలువురికి పదోన్నతులు

image

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నలుగురు ఏ.ఎస్.ఐలను ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఏఎస్ఐలుగా పనిచేస్తున్న టి.అర్జునరావు, ఎస్.శేషగిరిరావు, ఎస్.సన్యాసిరావులను అనకాపల్లి జిల్లాకు, జె.శంకరరావును అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఎస్ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News January 26, 2025

ప్రథమ బహుమతి సాధించిన gvmc శకటం 

image

76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నం పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో వివిధ శాఖల నుంచి 9 శకటాల ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్శనలో ప్రథమ బహుమతి జీవీఎంసీ , ద్వితీయ బహుమతి డీ.ఆర్.డీ.ఏ, తృతీయ బహుమతి వీఎంఆర్డిఏ శకటాలు సాధించాయి. మిగతా విద్యా, సమగ్ర శిక్ష అభియాన్ శకటాలకు ప్రోత్సాహక బహుమతులను కలెక్టర్ అందజేశారు.

News January 26, 2025

విశాఖలో 446 మందికి పురస్కారాలు

image

76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విశాఖ జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న 446 మంది ఉద్యోగులు పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఉదయం నగరంలో గల పోలీస్ శాఖ మైదానంలో కలెక్టర్ చేతుల మీదుగా ఉద్యోగులు ఈ అవార్డులను అందుకోనున్నారు. అవార్డు అందుకోనున్న వారిలో విఎంఆర్డిఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథం, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌తో పాటు పలువురు ఉద్యోగులు ఉన్నారు.

News January 26, 2025

విశాఖ పోలీసుల అదుపులో స్పా నిర్వాహకులు?

image

విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఓ స్పా సెంటర్‌పై పోలీసుల దాడులు శనివారం రాత్రి దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటనలో పశ్చిమ బంగా, విశాఖకు చెందిన ముగ్గురు యువతులతో పాటు విటుడు, స్పా నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్పాకు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.