News September 24, 2024
ఉమ్మడి విశాఖలో ముగ్గురికి నామినేటెడ్ పదవులు

ఉమ్మడి విశాఖలో ముగ్గురికి నామినేటెడ్ పదవులు వరించాయి. అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబును రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఛైర్మన్‌గా, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు(టీడీపీ), ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా (జనసేన)తమ్మిరెడ్డి శివశంకర్‌ను నియమించారు.
Similar News
News December 19, 2025
విశాఖలో కిలో బీన్స్ పిక్కలు రూ.125

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు శుక్రవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.46, ఉల్లి రూ.28, బంగాళదుంప రూ.13, వంకాయ రూ.42, బెండ రూ.54, మిర్చి రూ.44, బీరకాయ రూ.62, కాలిఫ్లవర్ రూ.26, కాకరకాయ రూ.60, చిలకడ దుంప రూ.34, దొండకాయ రూ.42, క్యారెట్ రూ.38, చిక్కుడుకాయ రూ.60, బీట్రూట్ రూ.34, పెన్సిల్ బీన్స్ రూ.50, బీన్స్ పిక్కలు రూ. 125, పొటల్స్ రూ.54, క్యాప్సికం రూ.44గా ఉన్నాయి.
News December 19, 2025
విశాఖలో పర్యటించనున్న రక్షణ రంగ కమిటీ

రక్షణ రంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2025-26) జనవరి 17 నుంచి 22వ తేదీ వరకు కొచ్చి, బెంగళూరు, విశాఖపట్నం, భువనేశ్వర్, వారణాసి నగరాల్లో అధ్యయన పర్యటన చేపట్టనుంది. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలోని NSTL ప్రతినిధులతో DRDO ప్రాజెక్టుల అప్‌గ్రేడేషన్‌పై, అదేవిధంగా కోస్ట్ గార్డ్ ప్రతినిధులతో తీరప్రాంత భద్రత, రక్షణ సన్నద్ధతపై కమిటీ సభ్యులు కీలక చర్చలు జరపనున్నారు.
News December 19, 2025
ఆరోగ్య శాఖ జీవోలపై విశాఖలో సమీక్ష

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు విశాఖలో పర్యటించనుంది. ఆరోగ్య శాఖకు సంబంధించిన జీవోల అమలును సమీక్షించేందుకు 22న కలెక్టరేట్లో, 23న DMHO కార్యాలయం & ఆంధ్రా మెడికల్ కాలేజీలో కమిటీ సమావేశమవుతుంది. అనంతరం స్థానిక ప్రాంతాలను సందర్శించి, 23న రాత్రి తిరుగు ప్రయాణం కానున్నట్లు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర తెలిపారు.


