News September 24, 2024

ఉమ్మడి విశాఖలో ముగ్గురికి నామినేటెడ్ పదవులు

image

ఉమ్మడి విశాఖలో ముగ్గురికి నామినేటెడ్ పదవులు వరించాయి. అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబును రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఛైర్మన్‌గా, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు(టీడీపీ), ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా (జనసేన)తమ్మిరెడ్డి శివ‌శంకర్‌ను నియమించారు.

Similar News

News July 10, 2025

మత్యకారులకు రాయితీపై బోట్లు, ఇంజిన్‌ల సరఫరా

image

‘జాతీయ ఫిష్ ఫార్మర్స్ డే’ని పురష్కరించుకొని గురువారం పెదజాలరిపేటలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్యకారులకు 55 ఇంజిన్లు సరఫరా చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు చేతుల మీదుగా వాటిని అందించారు. రూ.45.81 లక్షలు విలువ కలిగిన ఇంజిన్లకు ప్రభుత్వం రూ.18.32 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. నియోజకవర్గంలో బోట్లు, ఇంజిన్లు, వలలు కావలసిన జాలరులకు 40% రాయితీపై సరఫరా చేస్తామన్నారు.

News July 10, 2025

పిల్ల‌ల ల‌క్ష్య సాధ‌న‌లో త‌ల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవ‌స‌రం: కలెక్టర్

image

పిల్లల ల‌క్ష్య సాధ‌న‌లో త‌ల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవ‌స‌ర‌మ‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. మెగా పేరెంట్స్&టీచ‌ర్స్ మీటింగుల్లో భాగంగా చిన‌గ‌ద‌లి జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్లో గురువారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి పాల్గొన్నారు. చిన్నారుల‌కు వారి తల్లిదండ్రులు రోజూ ప్ర‌త్యేక స‌మ‌యం కేటాయించాల‌ని, పాఠ‌శాల నుంచి వ‌చ్చాక ఉత్తేజ‌ప‌రచాల‌ని సూచించారు.

News July 10, 2025

విశాఖ: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కంచరపాలెం సమీపంలోని NCC రైల్వే యార్డ్ వద్ద జరిగింది. స్థానికుల సమాచారంతో GRP ఎస్‌ఐ అబ్దుల్ మారూఫ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయసు సమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. అతని ఐడెంటిటికీ సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని, మృతదేహాన్ని KGHకి తరలించామన్నారు. పై ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పేర్కొన్నారు.