News August 30, 2024
ఉమ్మడి విశాఖ జిల్లాకు ప్రత్యేక అధికారుల నియామకం

విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు సీనియర్ IASలను స్పెషల్ ఆఫీసర్స్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖకు హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సౌరభ్ గౌర్ను నియమించింది. అల్లూరి జిల్లాకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, అనకాపల్లికి ఇండస్ట్రీస్ డైరెక్టర్ సీహెచ్.శ్రీధర్ను నియమించింది.
Similar News
News December 4, 2025
విశాఖ: రక్షణలేని ఉక్కు నిర్వాసితుల స్థలాలు

ఉక్కు పరిశ్రమ నిర్వాసితుల కోసం కేటాయించిన స్థలాల్లో కబ్జాదారులు చొరబడుతున్నారు. ఇటీవల గాజువాకలోని వికాస్ నగర్ ITI రోడ్డు వద్ద సర్వే నంబర్ 153 భూమిలో రాత్రికి రాత్రే 18 షెడ్లు నిర్మించేందుకు ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు. బీసీ రోడ్డు శివాలయం దగ్గర ఆరేళ్లుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరకు అధికారులు నిర్మాణాలను తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
News December 4, 2025
GVMC స్థాయి సంఘంలో ఇష్టారాజ్యంగా ప్రతిపాదనలు..

GVMC స్థాయి సంఘం సమావేశం శనివారం జరగనుంది. మొత్తం 257 అంశాలతో అజెండా కాపీలను సిద్ధం చేసి సభ్యులకు అందజేశారు. ఇన్ని అంశాలను ఒకే సారి పెట్టడం ద్వారా ఎలాంటి చర్చ లేకుండా అమోదించే అవకాశం ఉంది. దీంతో ఆయా అంశాలను స్థాయి సంఘం సభ్యులు పూర్తిగా చదివే అవకాశం కూడా లేకుండా పోతుంది. ప్రజాధనాన్ని అవసరం ఉన్నా.. లేకపోయినా ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
News December 4, 2025
విశాఖలో నేవీ అమరవీరులకు నివాళి

విశాఖ బీచ్ రోడ్డులోని ‘విక్టరీ ఎట్ సీ’ వద్ద తూర్పునౌకదళ అధికారులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అమరులైన నావిక దళ వీరులకు నివాళులర్పించారు. రక్షణ వ్యవస్థలో తూర్పునౌకదళం కీలకంగా పనిచేస్తుందని వారు కొనియాడారు. నేవీ డే సందర్భంగా గురువారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ ఏడాది విశాఖలో నేవీ డే విన్యాసాలను నిర్వహించకపోవడంతో నగరవాసులు నిరుత్సాహానికి గురయ్యారు.


