News September 26, 2024
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షుల నియామకం
ఉమ్మడి విశాఖ జిల్లాలోని వైసీపీ అధ్యక్షులను పార్టీ అధిష్ఠానం గురువారం నియమించింది. విశాఖకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను, అనకాపల్లి జిల్లాకు మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడిని నియమించింది. అటు అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షునిగా పాడేరు MLA విశ్వేశ్వర రాజుకి బాధ్యతలు అప్పగించారు. మరో వైపు విశాఖ వెస్ట్ ఇన్‌ఛార్జ్‌గా మళ్లా విజయప్రసాద్‌ను నియమించారు.
Similar News
News October 10, 2024
విశాఖ వేదికగా మలబార్ విన్యాసాలు
విశాఖ వేదికగా జరుగుతున్న మలబార్-2024 విన్యాసాల ప్రారంభ వేడుకల్లో నాలుగు దేశాలకు చెందిన నౌకాదళాల అధికారులు పాల్గొన్నారు. హిందూ మహాసముద్రంలో సవాళ్లను పరిష్కరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడి అవగాహన పెంపొందించుకునే లక్ష్యంతో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత్ దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి.
News October 10, 2024
విశాఖ: రూ.40 వేల జీతం.. దరఖాస్తులు ఆహ్వానం
కేజీహెచ్-ఏఎంసీలో నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ సెంటర్లో కోర్స్ కోఆర్డినేటర్ పోస్ట్ కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిబాబు తెలిపారు. నెలకు రూ.40 వేలు వేతనం చెల్లిస్తారని అన్నారు. నెల్స్ సిల్క్ ల్యాబ్‌లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 18లోగా పరిపాలన కార్యాలయం ఆంధ్ర మెడికల్ కాలేజీలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
News October 10, 2024
రైల్వే జోన్‌కు త్వరలో భూమి పూజ: ఎంపీ శ్రీభరత్
విశాఖ రైల్వే జోన్ త్వరలో ఏర్పాటు కానున్నట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. విశాఖ టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ త్వరలో విశాఖలో రైల్వే జోన్ కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్లాంటుకు రూ.1700 కోట్లు విడుదలైనట్లు తెలిపారు.