News September 27, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో 363 మద్యం షాపులు?

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో 363 మద్యం షాపులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. విశాఖ జిల్లాలో మొత్తం 161 షాపులకు గానూ అన్ రిజర్వ్ షాపులు 141, కల్లుగీత కార్మికులకు 19, సొండిలకు 1 కేటాయించినట్లు తెలుస్తోంది. అల్లూరి జిల్లాలో మొత్తం 37 షాపులన్నీ అన్ రిజర్వ్ చేయగా.. అనకాపల్లి జిల్లాలోని మొత్తం 165 షాపులకు అన్ రిజర్వ్ షాపులు 151, కల్లుగీత కార్మికులకు 14 షాపులు కేటాయించినట్లు సమాచారం.

Similar News

News August 31, 2025

విశాఖలో ఉత్తరాంధ్ర ప్రజా సంకల్ప వేదిక సమావేశం

image

ఉత్తరాంధ్ర ప్రజా సంకల్ప వేదిక విస్తృత స్థాయి సమావేశం ఆదివారం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మాదిరి రంగాసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలపై, రాజ్యాంగ హక్కులను కాపాడడం కోసం పనిచేస్తుందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవచేస్తున్న 35 మంది ప్రతినిధులను సేవారత్న అవార్డులతో సత్కరించారు.

News August 31, 2025

విశాఖలో వైసీపీ సర్వసభ్య సమావేశం

image

మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మహిళా సాధికారతో YCP బలోపేతం అవుతుందని అన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ కుంభారవి బాబు, ఇతర నేతలతో పాటు మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.

News August 30, 2025

విశాఖ: జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే

image

మాజీ ఎమ్మెల్యే, వీఎంఆర్డీఏ మాజీ ఛైర్మన్ ఎస్‌ఎ రెహమాన్‌ శనివారం జనసేనలో చేరారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రెహమాన్‌ గతేడాది వైసీపీకి రాజీనామా చేశారు. జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు.