News July 11, 2024

ఉమ్మడి విశాఖ జిల్లా జనాభా 50.66 లక్షలు..!

image

ఉమ్మడి విశాఖ జిల్లా జనాభా 50,66,616కు చేరుకుంది. విశాఖ జిల్లాలో 23,85,658 మంది, అనకాపల్లి జిల్లాలో 17,26,998 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9,53,960 మంది జనాభా ఉన్నట్లు ఏయూ జనాభా అధ్యయన కేంద్రం అంచనా వేసింది. 2011 పోల్చితే ఉమ్మడి జిల్లాలో సుమారు 8 లక్షలకు పైగా జనాభా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి విశాఖ జిల్లా జనాభా 42,90,599గా ఉంది.

Similar News

News November 25, 2025

విశాఖ: కూచిపూడి గురువు పొట్నూరు శంకర్ కన్నుమూత

image

ప్రఖ్యాత కూచిపూడి రెండో తరం గురువు ‘కళారత్న’ పొట్నూరు విజయ భరణి శంకర్‌ (90) సోమవారం విశాఖలోని ఎండాడలో కన్నుమూశారు. వెంపటి పెద్ద సత్యం వద్ద శిక్షణ పొంది, 1982లో అకాడమీ స్థాపించి వందలాది మంది నర్తకులను ఆయన తీర్చిదిద్దారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ, నాట్యకళా ప్రపూర్ణ వంటి పురస్కారాలు అందుకున్న ఆయన 6 దశాబ్దాలుగా కళారంగానికి సేవలు అందించారు. ఆయన మృతిపట్ల కళాకారులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు

News November 25, 2025

విశాఖ: ఐఫోన్ కొనివ్వలేదని బాలుడి సూసైడ్

image

ఐఫోన్ కొనివ్వలేదని తల్లిదండ్రుల మీద అలిగి బాలుడు(17) ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం.. ఆరో తరగతి వరకు చదువుకున్న బాలుడు చదువు మానేసి ఇంట్లోనే ఉండేవాడు. తల్లిదండ్రులు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు. ఐఫోన్ కావాలని తండ్రితో గొడవ పడి ఇంటికి రావడం మానేశాడు. కాగా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News November 25, 2025

ఫార్మా బస్సులకు గాజువాకలోకి నో ఎంట్రీ

image

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు