News April 2, 2024
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు వీరే

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. ఇచ్చాపురం – వసుపత్రి చక్రవర్తిరెడ్డి, పలాస – మజ్జి త్రినాథ్ బాబు, పాతపట్నం – కొప్పురోతు వెంకటరావు, శ్రీకాకుళం – పైడి నాగభూషణరావు, ఆమదాలవలస – సనపల అన్నాజీరావు, ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వరరావు, నరసన్నపేట – మంత్రి నరసింహమూర్తి, రాజాం – కంబాల రాజవర్దన్, పాలకొండ – చంటిబాబు.
Similar News
News November 25, 2025
పలాస జిల్లా లేనట్లేనా..?

పలాస కేంద్రంగా ఉద్దానం ఏరియాను జిల్లాను చేయాలనే డిమాండ్ ఇక్కడి ప్రజల్లో ఉంది. గత ప్రభుత్వం పలాసను జిల్లా చేస్తామని ప్రకటించినప్పటికీ.. కేవలం రెవెన్యూ డివిజన్‌గా మార్చి వదిలేసింది. జిల్లాగా ప్రకటించకపోవడంతో పలాసతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈప్రభుత్వంలోనైనా ఏర్పాటు అవుతుందని అందరూ భావించారు. దీనిపై అసలు చర్చే లేకపోవడంతో జిల్లా లేనట్టేనని తెలుస్తోంది.
News November 25, 2025
జాతీయస్థాయి పోటీలకు సిక్కోలు విద్యార్థిని ఎంపిక

జి.సిగడం కేజీబీవీ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని ఆర్.స్వాతి జాతీయస్థాయి పరుగు పందేనికి ఎంపికైంది. హర్యానాలో ఈ నెల 26 నుంచి 30 వరకు అండర్-19 క్యాటగిరీలో 4×100 రిలే పరుగు పందెంలో పాల్గొననుంది. రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రదర్శనతో జాతీయస్థాయికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రమీల తెలిపారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.
News November 24, 2025
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 52అర్జీలు

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 52 ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.


