News June 3, 2024

ఉమ్మడి శ్రీకాకుళం Rtv సర్వే TDP-7, YCP-3

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-7, YCP-3 స్థానాలో గెలుస్తుందని తెలిపారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, రాజాం స్థానాల్లో TDP పాగా వేస్తుందని, ఎచ్చెర్ల, నరసన్నపేట, పాలకొండ YCP గెలిచే అవకాశం ఉందన్నారు. రేపు కౌటింగ్ సదర్భంగా అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Similar News

News January 3, 2026

మందస: గోడ కూలి కార్మికురాలు మృతి

image

మందస మండలం బేతాళపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఇల్లు నిర్మాణ పనులు చేపడుతుండగా..బత్తిని కాంతమ్మ (39) అనే భవన నిర్మాణ కార్మికురాలిపై ఒక్కసారిగా గోడ కూలిపోయింది. తీవ్ర గాయాల పాలైన కాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 3, 2026

శ్రీకాకుళం: B.Ed పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 14 B.Ed కళాశాల్లో మొదటి సెమిస్టర్ పరీక్షలకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 17లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఈనెల 27 నుంచి పరీక్షలు నిర్వహించనున్నామని వెల్లడించారు. 1,000 మంది వరకు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. త్వరలో పరీక్ష షెడ్యూల్ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

News January 3, 2026

శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

శ్రీకాకుళం జిల్లాలో 57 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.