News February 14, 2026

ఉమ్మడి ADBలో బీజేపీ కోటకు బీటలు

image

శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో బలమైన శక్తిగా ఉన్న బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ నుంచి నలుగురు MLAలు, ఒక MP ఉండటంతో బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని భావించారు. కానీ అనూహ్యంగా ADB(21) మినహాయిస్తే నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ప్రతిష్ఠాత్మకంగా భావించిన భైంసాలో సైతం చతికిలబడింది.

Similar News

News March 6, 2026

రేపు 11:01AMకి ‘ధురంధర్-2’ ట్రైలర్

image

ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ధురంధర్-2’ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 11.01 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈసారి హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. కాగా ‘ధురంధర్’ తొలి పార్ట్ ఏకంగా రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.

News March 6, 2026

ప్రారంభమైన మహా కుంభాభిషేక మహోత్సవాలు

image

ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ద్వాదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం కనకదుర్గానగర్ ప్రవేశద్వారం నుంచి పవిత్ర కలశాలతో అర్చకులు, వేదపండితులు ఇంద్రకీలాద్రికి చేరుకునే కలశ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు.

News March 6, 2026

HYDలోని మరో ఆఫీస్‌కు బాంబు బెదిరింపు

image

బేగంపేట వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. 14 బాంబులు అమర్చామని, మధ్యాహ్నం వరకు అవి పేలుతాయని ఈమెయిల్ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధాన భవనం సురక్షితమని అధికారులు తేల్చారు. ఇటీవల వరుసగా కోర్టులకు సైతం బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే.