News January 31, 2025

ఉమ్మడి ADB జిల్లాలో ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా..!

image

మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 27న జరగనున్న ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5, 512 మంది ఉపాధ్యాయులు, 67, 768 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Similar News

News November 2, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 02, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 2, 2025

KMR: ‘తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు’

image

పల్వంచ మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన మహిళా అత్యాచార ఘటన నిందితుడిని అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ASP చైతన్య రెడ్డి, రురల్ CI రామన్‌లను ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అభినందించారు. శనివారం జిల్లాలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఆయన వారిని శాలువాతో సత్కరించారు. తప్పు చేసిన వారెవరు చట్టం పరిధిలో నుంచి తప్పించుకోలేరన్నారు. బాధితులకు పోలీసులే రక్షణగా మారాలన్నారు.

News November 2, 2025

ప్రైవేట్ ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలోని అన్ని ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం ఆదేశించారు. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పండుగలు, జాతరల సమయంలో భద్రతా చర్యలు, బారికేడ్లు, క్యూలైన్ వ్యవస్థలు అమలు చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.