News February 1, 2025
ఉమ్మడి ADB జిల్లాలో ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా..!

మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 27న జరగనున్న ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5, 512 మంది ఉపాధ్యాయులు, 67, 768 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Similar News
News December 10, 2025
పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

తెలంగాణలో రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3,800 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఆయా స్కూళ్లకు ఇవాళ కూడా హాలిడే ఉంది. తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13,14(ఆదివారం),16,17న కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.
News December 10, 2025
సంగారెడ్డి: ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

మొదటి విడత ఎన్నికలు జరిగే 7 మండలాల్లో సైలెంట్ పీరియడ్ అమల్లో ఉందని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. గుమ్మడిదల, హత్నూర, కంది, కొండాపూర్, పటాన్ చెరు, సదాశివపేట, సంగారెడ్డి మండలాల్లో 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉన్నాయన్నారు. ఎవరూ ఎన్నికల ప్రచారం చేయకూడదని సూచించారు.
News December 10, 2025
రాజమండ్రిలో ఈనెల 12న జామ్ మేళా!

రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని ఆమె సూచించారు.


