News January 30, 2025
ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి: CM

ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని CM రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతికుమారితో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాలకు భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు చేయాలన్నారు.
Similar News
News November 25, 2025
పేలిన పెయింటింగ్ డబ్బాలు

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దారుణ ఘటన జరిగింది. సాయిబాబా ఆలయం సమీపంలో బొమ్మలు తయారు చేస్తుండగా, పెయింటింగ్ డబ్బాలు తెరవగానే ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ బ్లాస్టింగ్‌లో కమలేశ్, అశోక్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కమలేశ్ చేతి వేళ్లు తెగిపడినట్లు సమాచారం. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
News November 25, 2025
ఇక పోలీసుల గుప్పిట్లో కర్రె గుట్టలు..!

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ను వేరు చేస్తూ ఇప్పటి వరకు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న కర్రెగుట్టలు పోలీసులకు అడ్డాగా మారనున్నాయి. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ మనుగడ సాగించలేని పరిస్థితికి చేరుకుంది. రెండు రాష్ట్రాల పోలీసులు ఇప్పటికే కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తాజాగా ఏర్పాటైన బేస్ క్యాంపుతో ఒకప్పటి మావోయిస్టుల స్థావరం పోలీసుల వశమైంది. త్వరలో గుట్టపైన క్యాంపులు ఏర్పాటు కానున్నాయి.
News November 25, 2025
ICAR-IIMRలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

HYDలోని ICAR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌లో 5 సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc(జెనిటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, లైఫ్ సైన్స్, ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ ), PhD, PG( అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్) ఉత్తీర్ణతతో పాటు NET అర్హత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్: https://www.millets.res.in/


