News January 30, 2025
ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి: CM

ఉమ్మడి ADB జిల్లాలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని CM రేవంత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతికుమారితో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాలకు భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు చేయాలన్నారు.
Similar News
News November 20, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు ఆది సాయికుమార్

వరంగల్ భద్రకాళి అమ్మవారిని గురువారం ప్రముఖ సినీ నటుడు ఆది సాయికుమార్ దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు శేషు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి శేష వస్త్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త వీరన్న, అధికారులు క్రాంతి కుమార్, సీనియర్ అసిస్టెంట్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
News November 20, 2025
వరంగల్: ‘స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి’

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులకు ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్లో సర్పంచ్ ఎన్నికల ఏర్పాట్లు, రిజర్వేషన్లు, ఓటరు జాబితాలపై ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్య రాణి తదితరులు పాల్గొన్నారు.
News November 20, 2025
జగన్ జైలుకెళ్లడం ఖాయం: మంత్రి సత్యకుమార్

AP: పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ కోర్టులను మభ్యపెట్టలేరని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘విచారణలో భాగంగా కోర్టులకు హాజరయ్యేవారు వినయంగా వ్యవహరిస్తారు. తాను కోర్టుకు హాజరైతే సమస్యలు ఎదురవుతాయని కోర్టును నమ్మబలికే ప్రయత్నంలో భాగంగానే HYDలో నానా హంగామా చేశారు. జగన్లో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకు వెళ్లడం ఖాయం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.


