News September 15, 2024

ఉమ్మడి KNR జిల్లాలో పాఠశాలల వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఈ విధంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 784 పాఠశాలల్లో 98,240 విద్యార్థులు, కరీంనగర్ జిల్లాలో 1,071 పాఠశాలల్లో 1,57,648 విద్యార్థులు, జగిత్యాల జిల్లాలో 1,165 పాఠశాలల్లో 1,59,585 విద్యార్థులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 659 పాఠశాలల్లో 87,390 విద్యార్థులు ఉన్నారు.

Similar News

News October 10, 2024

టాటా లేని లోటు పూడ్చలేనిది: కేటీఆర్

image

రతన్ టాటా మరణం పట్ల KTR సంతాపం తెలిపారు. రతన్‌టాటా అద్భుతమైన ఆవిష్కర్త, దార్శనీకుడు, మహనీయుడని అన్నారు. టాటా మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన ఆయన ఎంతోమందికి ప్రేరణ అని పేర్కొన్నారు. రతన్ టాటా వినయపూర్వ దిగ్గజమని కొనియాడారు. వ్యాపార రంగంలో ఆయన లేని లోటు పూడ్చ లేనిదన్నారు. దాతృత్వంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు.

News October 10, 2024

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకటరావుపేట రోడ్డుపై హోండా షోరూం ముందు ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డు విధులు నిర్వహిస్తున్న సుబ్బరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 10, 2024

కరీంనగర్: తమ్ముడిని చంపిన అన్న

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో మంగళవారం అర్ధరాత్రి తమ్ముడిని అన్న చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రేమలత-రాజయ్యకు కుమారులు కుమారస్వామి, చంద్రయ్య. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా, వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో చంద్రయ్య మద్యం తాగి అన్నతో గొడవకు దిగాడు. ఆవేశంతో కుమారస్వామి ఇనుపరాడ్‌తో దాడి చేయగా చంద్రయ్య చనిపోయాడు.