News March 30, 2024

ఉమ్మడి KNR జిల్లాలో భానుడి భగభగ

image

ఉదయం తొమ్మిది దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రత 42.5℃గా నమోదైంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు.

Similar News

News January 12, 2025

సాగర్ జి ఆత్మకథను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది: సీఎం

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు (సాగర్ జీ) ఆత్మకథను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సాగర్ జీ ఆత్మకథ పుస్తకం ఉనికను ఆదివారం ఆవిష్కరించారు. తెలంగాణ ఉనికిని దేశ స్థాయిలో చాటిన కొద్ది మంది ప్రముఖుల్లో CH.విద్యాసాగర్ రావు ఒకరని, ఆయన ఆత్మ కథను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని సీఎం తెలిపారు.

News January 12, 2025

కొత్తకొండ: వీరభద్ర స్వామి ఆలయంలో లక్షబిల్వార్చన

image

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బిల్వ పత్రాలతో లక్ష బిల్వార్చన, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. గణపతి పూజ, పుణ్యాహవచనం, నిత్య హోమాలు, హారతి, మంత్రపుష్పం, రుద్రాభిషేకం నిర్వహించి బిల్వార్చన చేశారు. లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.

News January 12, 2025

వీరన్న జాతరలో కొత్తపల్లి రథాలు స్పెషల్

image

కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఉత్సవాలలో భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి ఎడ్లబండ్ల రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంక్రాంతి రోజు ఆలయం చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షిణలు చేసి, భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని దర్శించుకుంటారు. 57 ఏళ్ల సంప్రదాయం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అందంగా అలంకరించిన 70 ఎడ్లబండ్ల రథాలు జాతరకు కదులుతాయి. దారివెంట రథాలు తిలకించేందుకు జనం ఆసక్తిగా చూస్తారు.