News August 21, 2024
ఉమ్మడి KNR జిల్లాలో 6,441 ఫోన్లు రికవరీ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీసులు సీఈఐఆర్తో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పెద్ద ఎత్తున రికవరీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మొత్తం 11,006 చరవాణులు ప్రజలు పోగొట్టుకున్నారు. ఇందులో 6,441 ఫోన్లను పోలీసులు సీఈఐఆర్ సాంకేతికత సాయంతో గుర్తించారు. రామగుండం కమీషనరేట్ చరవాణిలను అప్పగించడంలో ముందంజలో ఉంటే జగిత్యాల జిల్లా వెనుకంజలో ఉంది.
Similar News
News November 16, 2025
కరీంనగర్: ఓటరు జాబితా సవరణపై సీఈఓ సమీక్ష

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని అన్ని ఈఆర్ఓలు, ఏఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతిని, పెండింగ్లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను ఆయన సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్లో కరీంనగర్ కలెక్టరేట్ నుండి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.
News November 16, 2025
కేశవపట్నం పీఎస్లో సీపీ గౌస్ ఆలం ఆకస్మిక తనిఖీ

కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం శనివారం కేశవపట్నం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పనితీరు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని, వాటికి సంబంధించిన కేసు డైరీలను పరిశీలించారు. దర్యాప్తు వేగవంతం చేయాల్సిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న అనంతరం, ఠాణా అధికారి ఎస్సై శేఖర్కు సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
News November 16, 2025
KNR: 17 నుంచి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని జిల్లా సంక్షేమ అధికారి కె.సబిత కుమారి తెలిపారు. నవంబర్ 17న జిల్లా పరిషత్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం, 18న మండలాల్లో ఆరోగ్య శిబిరాలు, 19న కలెక్టరేట్లో ప్రధాన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వయోవృద్ధులు ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె సూచించారు.


