News February 6, 2025

ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.

Similar News

News November 6, 2025

కృష్ణా జిల్లాలోకి రానున్న కైకలూరు నియోజకవర్గం

image

ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గం త్వరలోనే కృష్ణా జిల్లాలోకి రానుంది. జిల్లాల మార్పుకై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెల్లడించిన వివరాల మేరకు.. ఈ మార్పుకై గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఏలూరు డివిజన్‌లో ఉన్న కలిదిండి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, మండలాలు గుడివాడ రెవిన్యూ డివిజన్ కిందకు రానున్నాయి.

News November 6, 2025

ప్రశ్నార్ధకంగా పెనమలూరు?

image

పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని స్థానికులు కోరుతున్నప్పటికీ అక్కడి ప్రజాప్రతినిధుల అభీష్టం వేరుగా ఉంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న పెనమలూరు నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం 60 కి.మీ. ప్రయాణించాలి. విజయవాడకు పక్కనే ఉన్న పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలంటూ వచ్చిన సూచనలను మంత్రివర్గ ఉపసంఘం సైతం పరిశీలించడలేదనే విమర్శలు వస్తున్నాయి.

News November 6, 2025

గుంతలో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో <<18207678>>నిన్నటి<<>> బస్సు ప్రమాదం మరవకముందే, నేడు మరో ఘటన జరిగింది. మండల పరిధిలోని తక్కల్లపల్లి గ్రామంలో విద్యార్థుల ఆర్టీసీ బస్సును డ్రైవర్ రివర్స్ చేస్తుండగా గుంతలోకి దిగింది. విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. బస్సు గుంతలో ఇరుక్కుపోవడంతో స్థానికులు ట్రాక్టర్ సహాయంతో బయటకు లాగారు. డ్రైవర్లు అప్రమత్తంగా బస్సులు నడపాలని, నిర్లక్ష్యం విడనాడాలని స్థానికులు వాపోతున్నారు.