News February 6, 2025

ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.

Similar News

News February 6, 2025

పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల

image

TG: పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 1న రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. మరోవైపు మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. MAR 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. జూన్ 11-14 వరకు పరీక్షలు నిర్వహించనుంది.

News February 6, 2025

సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పరిణామం

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పురోగతి లభించింది. దాడి చేసిన నిందితుడిని సైఫ్‌ సిబ్బంది గుర్తించారు. పోలీసులు నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో నిందితుడిని వారు స్పష్టంగా గుర్తించి చూపించారు. సైఫ్‌పై దాడి చేసింది అతడేనని పోలీసులకు తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News February 6, 2025

రాజమండ్రి: పవన్ కల్యాణ్ కోసం జన సైనికుల పూజలు

image

అస్వస్థతకు గురైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కల్యాణ్‌కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ గురువారం జనసేన నాయకులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి దేవీచౌక్‌లోని శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి, శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు, ప్రార్థనలు చేశారు. జనసేన నాయకులు సూర్య బయ్యపునీడి, విక్టరీ వాసు, చక్రపాణి, విన్నా వాసు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!