News March 19, 2025
ఉమ్మడి MBNR యువతకు సువర్ణవకాశం

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఉమ్మడి MBNR జిల్లాలోని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఏప్రిల్ 5 వరకు http:///tgobmmsnew.cgg.gov.in లో అప్లై చేసుకుంటే జూన్ 2న అర్హుల తుది జాబితా ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లాలో 48వేల మందికి పైగా యువతకు లబ్ధిచేకూరనుంది. ఒక్కో నియోజకవర్గానికి 4వేలకు పైగా యూనిట్లు మంజూరు చేయనున్నారు. అవసరమైన వారికి SHARE IT.
Similar News
News March 19, 2025
మా పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ చట్టం: మందకృష్ణ

మూడు దశాబ్దాల పాటు ఎస్సీ వర్గీకరణపై తాము చేపట్టిన పోరాట ఫలితమే వర్గీకరణకు చట్ట రూపం దాల్చిందని పద్మశ్రీ మందకృష్ణ మాది అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన క్లబ్‌లో మాట్లాడుతూ.. వర్గీకరణ చట్ట రూపం దాల్చడంతో నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సభలు, విజయోత్సవం నిర్వహిస్తామన్నారు. చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వారికి దోచి పెట్టారన్నారు.
News March 19, 2025
కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్స్‌లర్

కాళోజి నారాయణ రావు హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్స్‌లర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నియమించారు. ఇతడు మూడు సంవత్సరాలు కొనసాగుతారని నియామక పత్రంలో తెలిపారు. నేడు లేక రేపు కొత్త వైస్ ఛాన్స్‌లర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
News March 19, 2025
IPL అభిమానులకు పోలీసుల సూచన!

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం నుంచి IPL మ్యాచులు జరగనున్నాయి. ఈక్రమంలో స్టేడియంలోకి తేకూడని వస్తువులను పోలీసులు సూచించారు. ‘కెమెరాలు& రికార్డింగ్ పరికరాలు, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ & ఎయిర్‌పాడ్స్, సిగరెట్, అగ్గిపెట్టె, కత్తులు, గన్స్, వాటర్ & ఆల్కహాల్ బాటిల్స్, పెట్స్, తినుబండారాలు, బ్యాగ్స్, ల్యాప్‌టాప్స్, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్, బైనాక్యులర్, టపాసులు, డ్రగ్స్’ వంటివి తీసుకురాకూడదని పోలీసులు తెలిపారు.