News March 17, 2025
ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి

ఓర్వకల్ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యాలవాడ పేరు పెట్టాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
Similar News
News March 18, 2025
పెద్దపల్లి: నేడు ఇంటర్మీడియట్ పరీక్షలకు 111మంది గైర్హాజరు

పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఇంటర్మీడియట్ రెండోవ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 4927 విద్యార్థులకు 4816 హాజరయ్యారని పేర్కొన్నారు. 111 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 71 మంది, వొకేషనల్ 40మంది విద్యార్థులు హాజరుకాలేదన్నారు.
News March 18, 2025
కాకినాడ: గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక సాయం

రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ, బీసీ గృహాల లబ్ధిదారులకు అదనపు ఆర్దిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కాకినాడ జిల్లా హౌసింగ్ పీడీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో గృహాల నిర్మాణంలో లబ్ధిదారులకు అదనంగా నిధులు మంజూరైన పత్రాలు అందజేశారు. బీసీలకు రూ.50,000, ఎస్టీలకు రూ.75,000 ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. కావున లబ్ధిదారులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News March 18, 2025
TPT: కొనసాగుతున్న ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్షలు

తిరుపతి జిల్లాలో ఇంటర్ బ్రిడ్జ్ కోర్సు పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్– II, లాజిక్ పేపర్– II, బ్రిడ్జి కోర్స్ మాథ్స్ పేపర్– II జరిగింది. ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 767 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్ఐఓ జీవీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.