News November 16, 2024
ఉయ్యూరు: భార్యపై కోపంతో భర్త ఆత్మహత్య

ఉయ్యూరు మండలం ఆనందపురంలో భార్యపై కోపంతో పుల్లేరు కాలువలో దూకి బిట్రా పోతురాజు (44) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు పోతురాజు కిరాణా షాపు నిర్వహిస్తూ ఉండేవాడు. శనివారం భార్యాభర్తలు గొడవ పడడంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News September 16, 2025
దేవుడి భూములను కొట్టేస్తే సమగ్ర విచారణ చేసుకోండి – పేర్ని నాని

మచిలీపట్నంలోని రంగనాయక స్వామి దేవస్థానంకు చెందిన భూములను తాను కారు చౌకగా కొట్టేశానని కూటమి నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. నిజంగా స్వామి వారి భూములను తాను అక్రమ మార్గంలో తీసుకుంటే నాడు జరిగిన వేలంపాటపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ అవినీతిని తాను బట్టబయలు చేస్తుండటంతో తనపై కక్ష కట్టి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News September 15, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ
☞ కృష్ణా జిల్లా కొత్త ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణాలో13 మంది ఎంపీడీవోలకి పదోన్నతి
☞ కృష్ణాలో ఇంటి స్థలాల కోసం 19,382 దరఖాస్తులు
☞ వాట్సాప్లో కనకదుర్గమ్మ అర్జిత సేవ టికెట్లు
☞ కురుమద్దాలి ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం.. నలుగురికి గాయాలు
News September 15, 2025
కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ

కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న గీతాంజలి శర్మను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆమె పనితీరు ప్రశంసలు పొందింది. ఇకపై ఫైబర్ నెట్ విస్తరణలో కీలక పాత్ర పోషించనున్నారు. కొత్త జాయింట్ కలెక్టర్పై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.