News January 26, 2025
ఉయ్యూరు: యువకుడిపై పొక్సో కేసు నమోదు

ఉయ్యూరు పట్టణంలో నివసిస్తున్న మైనర్ బాలికపై గుడివాడకు చెందిన కొడాలి నాగబాబు అత్యాచారం చేయడంతో అతనిపై ఉయ్యూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మైనర్ బాలికను అపహరించి పలుమార్లు అత్యాచారం చేయడంతో బాధిత మహిళ తప్పించుకొని తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారించి యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Similar News
News November 6, 2025
నంద్యాల: గమ్యం చేరాలంటే సాహసం చేయాల్సిందే..!

మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరకడం కష్టంగా మారింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పాటు పని నిమిత్తం వెళ్లే వారికి అవస్థలు ఎదురవుతున్నాయి. బస్సుల్లో సీట్లు దొరకకపోవడంతో ప్రయాణికులు పడుతున్న పాట్లు అన్నీ, ఇన్నీ కావు. ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరం అని తెలిసినా గమ్యం చేరడానికి సాహసం చేయక తప్పడం లేదు.
News November 6, 2025
HYD: కార్తీక దీపాల మంటల్లో బాలిక దుర్మరణం

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో కార్తీక పౌర్ణమి వేళ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆర్ఎల్ నగర్‌వాసి మధుసూదన్ రెడ్డి కూతురు సాయి నేహారెడ్డి (7) ఇంట్లో దీపాలు వెలిగించే సమయంలో తన దుస్తులకు మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సైనిక్‌పురి అంకురా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కార్ఖానాలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
News November 6, 2025
మహబూబాబాద్‌లో జువెనైల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో త్వరలో జువెనైల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు కానున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎండీ అబ్దుల్ రఫీ ప్రకటించారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో తెలిపారు. 18 ఏళ్ల లోపు ఉన్న బాలలు నేరాలకు పాల్పడితే, వారిని నేరస్థులుగా కాకుండా చట్టంతో ఘర్షణ పడిన వారిగా గుర్తించి, ఈ బోర్డు ద్వారా విచారిస్తారని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.


