News January 10, 2025

ఉయ్యూరు: G3 థియేటర్‌కు నోటీసులు

image

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో G3 శ్రీనివాస థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి 1 గంటకు ఈ థియేటర్ బెనిఫిట్‌ షో వేస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ యాజమాన్యానికి ఉయ్యూరు టౌన్ పోలీసులు నోటీస్ ద్వారా తెలిపారు.

Similar News

News November 27, 2025

MTM: పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌పై కలెక్టర్ సమీక్ష

image

రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్న మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోనశశిధర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్స్ సమావేశంపై వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. సమావేశంలో విద్యార్థుల పురోగతిపై చర్చించారు.

News November 27, 2025

కృష్ణా: త్వరలో సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టుల భర్తీ

image

కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె. బాలాజి తెలిపారు. గురువారం ఉదయం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల పనుల పురోగతిని జిల్లాల వారీగా సమీక్షించారని కలెక్టర్ వివరించారు.

News November 27, 2025

కృష్ణా: రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మిల్లర్లు..!

image

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి కృష్ణా జిల్లా రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర హామీ నీటిపై రాతయ్యిందని అంటున్నారు. ఇక్కడి మిల్లర్లు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో, గోదావరి జిల్లాల మిల్లర్లు 28% తేమ ఉన్న ధాన్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.