News January 29, 2025

ఉరవకొండలో ఉద్యోగం పేరుతో రూ.23 లక్షలు స్వాహా

image

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.23 లక్షలు తీసుకుని ఓ ఆగంతకుడు మహిళను మోసం చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఆ వ్యక్తి బ్యాంకులో టెలికాలర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. ఆమె మొదట కొంత నగదు ఆ వ్యక్తి ఖాతాకు జమచేసింది. ఆమెను నమ్మించేందుకు అతను ఆ మహిళ ఖాతాకు తిరిగి నగదు వేశాడు. ఆ తర్వాత పూర్తిగా నమ్మిన ఆ మహిళ 2 బ్యాంకు ఖాతాల నుంచి రూ.23 లక్షలు పంపి మోసపోయింది. స్థానిక PSలో కేసు నమోదైంది.

Similar News

News November 4, 2025

మీర్జాగూడ ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణం: DGP

image

TG: మీర్జాగూడ బస్సు ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని DGP శివధర్ రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఇవాళ ఆయన పరిశీలించారు. ‘ఇక్కడ రోడ్డు మలుపు ఉంది కానీ యాక్సిడెంట్ అయ్యేంత తీవ్ర మలుపు లేదు. దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయి. టిప్పర్ కండిషన్‌ను పరిశీలిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ పరంగా చూడకూడదు. అందరి బాధ్యతగా చూడాలి. డ్రైవర్లు డిఫెన్స్ కండిషన్‌ను అంచనా వేసుకోవాలి’ అని సూచించారు.

News November 4, 2025

తిరుపతి జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో భారీ భద్రత

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే ఆలయాల్లో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. క్యూ లైన్ నిర్వాహణ, వచ్చి వెళ్లే మార్గాలు, పార్కింగ్, ట్రాఫిక్, దర్శనం తదితర అంశాలపై ఆయా ఆలయాల కమిటీలతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

News November 4, 2025

జూరాలకు 28 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

image

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పూర్తిగా తగ్గింది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 28 వేల క్యూసెక్కులు వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 30,287 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాలువలకు, భీమా లిఫ్ట్‌కు కలిపి 2,018 క్యూసెక్కుల నీటిని, మొత్తంగా 33,102 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్నారు.