News January 29, 2025
ఉరవకొండలో ఉద్యోగం పేరుతో రూ.23 లక్షలు స్వాహా

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.23 లక్షలు తీసుకుని ఓ ఆగంతకుడు మహిళను మోసం చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఆ వ్యక్తి బ్యాంకులో టెలికాలర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. ఆమె మొదట కొంత నగదు ఆ వ్యక్తి ఖాతాకు జమచేసింది. ఆమెను నమ్మించేందుకు అతను ఆ మహిళ ఖాతాకు తిరిగి నగదు వేశాడు. ఆ తర్వాత పూర్తిగా నమ్మిన ఆ మహిళ 2 బ్యాంకు ఖాతాల నుంచి రూ.23 లక్షలు పంపి మోసపోయింది. స్థానిక PSలో కేసు నమోదైంది.
Similar News
News February 14, 2025
ఒక్క డోర్ మాత్రమే తెరచి ఉండేలా చూడాలి: కలెక్టర్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి జివిఎంసి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రం, బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు ఒక్క డోర్ మాత్రమే తెరచి ఉండేలా చూడాలన్నారు.
News February 14, 2025
NZB: ఒంటరి మహిళ మెడలోంచి గొలుసు అపహరణ

NZBలో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును అపహరించుకు వెళ్లాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వీక్లీ మార్కెట్‌కు చెందిన విజయ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ ఎస్ఐ మొగులయ్య తెలిపారు.
News February 14, 2025
గోదావరిఖని: ‘పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి’

గోదావరిఖనిలో సింగరేణి సంస్థకు అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సింగరేణి C&MD బలరాంకు వినతి పత్రం ఇచ్చినట్లు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేశ్ తెలిపారు. సింగరేణి పాఠశాలలో CBSE సిలబస్ అప్‌గ్రేడ్ చేయాలని, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి చేయాలని కోరారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు.