News January 29, 2025

ఉరవకొండ: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు (42) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతడిని వెంటనే కుటుంబసభ్యులు గమనించి ఆటోలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

Similar News

News February 16, 2025

విద్యార్ధి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలి: JNTU ఇన్‌ఛార్జ్ వీసీ

image

అనంతపురంలోని JNTU-OTPRIలో శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసం కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

News February 16, 2025

అనంత: సేవాగడ్‌లో డోలు, కత్తి పట్టిన కలెక్టర్

image

గుత్తి మండలం చెర్లోపల్లి సేవాఘడ్‌లోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్‌ను శనివారం అనంత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం కలెక్టర్‌కు ఆలయ కమిటీ సభ్యులు డోలు, కత్తిని అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలను లోకల్ ఫెస్టివల్‌గా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

News February 16, 2025

JNTUలోని మెకానికల్ ప్రొఫెసర్లను అభినందించిన ప్రిన్సిపల్

image

అనంతపురం JNTUలోని మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు కళ్యాణి రాధ, ఓం ప్రకాశ్‌ను శనివారం ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. NIT-Rలో ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో వారు ప్రదర్శించిన టెక్నికల్ పేపర్ మీద వారికి NIT-R నుంచి సర్టిఫికెట్, అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చెన్నారెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజులలో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.

error: Content is protected !!