News March 28, 2024

ఉరవకొండ: గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

ఉరవకొండ పట్టణంలోని 10వార్డ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శర్మాస్ వలి(23) బుధవారం సాయంత్రం బెంగళూరులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పీజీలో ఉంటున్న అతడికి ఉన్న ఫలంగా ఛాతీలో నొప్పి రావడంతో స్నేహితులు సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Similar News

News February 11, 2026

రైలు ద్వారా అరటి ఎగుమతికి సహకారం అందిస్తాం: కలెక్టర్

image

రైలు ద్వారా అరటి ఎగుమతిని చేపట్టేందుకు తగిన సహకారం అందిస్తామని ఎగుమతుదారులు, అరటి ఎగుమతి వీలైనంత త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రైల్వే ద్వారా తాడిపత్రి నుంచి జేఎస్‌పీటీ పోర్టుకు అరటి ఎగుమతులను ప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యాన శాఖ అధికారులు, అరటి ఎగుమతి దారులతో కలెక్టర్ సమీక్షించారు.

News February 11, 2026

నెలవారీ నేర సమీక్షా సమావేశం

image

అనంతపురం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఎస్పీ జగదీశ్ బుధవారం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, POCSO, రేప్ కేసులు, 174 Cr.P.C కేసులు తదితర వాటి కేసులను పూర్తి చేయాలన్నారు. కేసుల ఛేదింపునకు, పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు, మెళకువలను అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

News February 11, 2026

అనంత: ‘నిహార ఆసుపత్రికి నోటీసులు పంపించండి’

image

తాడిపత్రిలోని నిహార ఆసుపత్రికి నోటీసులు పంపించాలని సంబంధిత అధికారులను DMHO దేవి ఆదేశించారు. అక్కడి వైద్య సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కాన్పు విషయంలో సిజేరియన్ అవసరమైన సందర్భంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన నిహార ఆసుపత్రికి నోటీసులు జారీ చేయాలన్నారు. పేషంట్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.