News April 5, 2024

ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం.. భార్య పరిస్థితి విషమం

image

కూడేరు మండలం సమీపంలోని స్థానిక వ్యవసాయ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో కళగళ్ల గ్రామానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించి ఘటనపై కేసు నమోదు చేశారు.

Similar News

News November 17, 2025

అనంతపురం: పోలీసుల PGRSకు 83 పిటిషన్లు.!

image

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అర్బన్ DSP శ్రీనివాసరావు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా SP ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 83 పిటీషన్లు వచ్చాయి. పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నార్పల యువతి

image

5,895 మీటర్లు ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నార్పల మండలం దుగుమర్రికి చెందిన యువతి కె. కుసుమ అధిరోహించారు. దీంతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుసుమను ఆదివారం అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.