News November 3, 2024

ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

ఉరవకొండ పట్టణ శివారులోని 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడు పట్టణానికి చెందిన అంజిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

Similar News

News November 11, 2025

సిలిండర్ పేలి అనంతపురంలో వ్యక్తి మృతి

image

అనంతపురంలోని తపోవనంలో గ్యాస్ సిలిండర్ పేలి జిలాన్ బాషా (34) మృతిచెందారు. చిన్న సిలిండర్‌లో మోనో అమెనియం ఫాస్పేట్ నింపుతుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు జీజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.

News November 11, 2025

వరల్డ్ కప్‌లో గుంతకల్లు యువకుడి ప్రతిభ

image

ఇటీవల భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఉమెన్స్ టీంలో ఒక సభ్యుడిగా గుంతకల్లుకు చెందిన క్రాంతికుమార్ ఘనత సాధించాడు. క్రాంతి కుమార్ టీం ఫిట్నెస్ కోచ్, ఫిజియోథెరపిస్ట్‌గా టీమ్‌కు సేవలు అందించాడు. గుంతకల్లు పట్టణానికి చెందిన క్రీడాకారుడు ఉమెన్స్ టీం మెంబెర్‌గా ఉండటం గుంతకల్లు పట్టణానికి గర్వకారణం అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.