News November 3, 2024
ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ఉరవకొండ పట్టణ శివారులోని 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడు పట్టణానికి చెందిన అంజిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.
Similar News
News December 6, 2024
సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి: కలెక్టర్ చేతన్
గ్రామ సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ నమోదును తప్పనిసరిగా చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ పనులపై సమీక్ష నిర్వహించారు. పనుల్లో వెనుకబడిన ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీచేశారు.
News December 6, 2024
శ్రీ సత్యసాయి: ‘నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకోండి’
నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్‌ను ఆదేశించారు. గురువారం పౌర సరఫరాల శాఖ అంశంపై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని సూచించారు. అధికారులు, రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ వల్ల రైతుల ఇబ్బంది పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 6, 2024
ప్రతిష్ఠాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి: జేసీ
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తోందని, జిల్లాలో కూడా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో రెవెన్యూ సదస్సులపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, రైతు సంఘం నేతలతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.