News April 6, 2024

ఉరవకొండ: వడదెబ్బతో యువకుడి మృతి

image

ఉరవకొండ పట్టణంలోని మల్లేశ్వర ఆలయ సమీపంలో నివసిస్తున్న దునోజ్ కుమార్(18) మూడు రోజుల కిందట వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఉన్న ఒక కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు మల్లికార్జున, రేణుకమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు.

Similar News

News January 16, 2025

అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా: ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగు అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతోందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఎస్పీ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, జూదం ఆడుతున్న వారిపై డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగిస్తామన్నారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

News January 15, 2025

కాకి అనే ఊరు ఉందని మీకు తెలుసా?

image

కొన్ని ఊర్ల పేర్లు వింటే ఇవి నిజంగానే ఉన్నాయా? అనే సందేహం వస్తుంది. శ్రీసత్యసాయి జిల్లా రొల్ల మండలంలోని ‘కాకి’ అనే గ్రామం కూడా ఇదే కోవలోకి వస్తుంది. దీని పూర్తిపేరు కాంచన కిరీటి. ఏపీలో చివరి గ్రామంగా, కర్ణాటకకు సరిహద్దుగా ఉంటుంది. 2011 జనాభా ప్రకారం ఈ గ్రామంలో 838 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 3వేలకు పైగా జనాభా ఉన్నారు. ఇలా మీకు తెలిసిన గ్రామం పేర్లు ఉంటే కామెంట్ చేయండి.

News January 15, 2025

ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌ని కలిసిన కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శాంతిభవనంలో ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌ని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కలిశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న, ఆర్డిఓ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అలాగే జిల్లాలో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.