News March 27, 2025
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య?

సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని బ్రహ్మేశ్వరంపల్లిలో మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మండల పరిధిలోని మొరసలపల్లికి చెందిన అర్చనను బ్రహ్మేశ్వరం పల్లి గ్రామానికి చెందిన శివశంకర్ వివాహం చేసుకున్నాడు. వారికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమార్తెను అత్తింటి వారే చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 18, 2025
అన్నదాత సుఖీభవ పండుగ వాతావరణంలో నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఈ నెల 19న ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులను ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాలని, కార్యక్రమంలో పాల్గొనే రైతులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News November 18, 2025
గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ భారత్‌కు అప్పగింత

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అధికారులు అతడిని ఇండియాకు తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సిద్దిఖీ కొడుకు జీషన్ US కోర్టులో పిటిషన్ వేయడంతో అన్మోల్ను భారత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.
News November 18, 2025
మత్తు పదార్థాల జోలికి యువత పోవద్దు: సీపీ సన్‌ప్రీత్ సింగ్

యువత మత్తు పదార్థాల జోలికి పోవద్దని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ మెడికల్ విద్యార్థులకు సూచించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


