News April 12, 2025

ఉస్మానియా కాలేజీ, హాస్పిటల్ వరల్డ్ ఫేమస్: మంత్రి దామోదర

image

ఉస్మానియా కాలేజీ, హాస్పిటల్ వరల్డ్ ఫేమస్, కోట్ల మంది పేషెంట్ల ఆశాదీపమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హైదరాబాద్‌లోని శుక్రవారం ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల 174వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక్కడ చదివిన ఎంతోమంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ హాస్పిటల్స్‌ను లీడ్ చేస్తున్నారని చెప్పారు.

Similar News

News January 16, 2026

మెదక్: రోడ్డు భద్రతపై సిబ్బందికి అవగాహన

image

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ అధికారులు ఉద్యోగులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీవోలు పాల్గొన్నారు.

News January 16, 2026

మేడారం జాతర.. 3 రోజులు సెలవులకు డిమాండ్

image

TG: మేడారం జాతరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. 4 రోజుల పాటు జరిగే ఈ గిరిజన జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని పేర్కొంది. ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో అత్యంత వైభవంగా జాతర జరగనుంది.

News January 16, 2026

జిల్లాలోనే మాజీ ఉపరాష్ట్రపతి

image

మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పండుగ సందర్భంగా జిల్లాలోని ఆయన స్వస్థలం వెంకటాచలం మండలంలోనే ఉన్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఆయనను పలువురు ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిరువురు జిల్లా పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు.