News August 8, 2024
ఉస్మానియా మెడికల్ కళాశాలకు ISO గుర్తింపు

ఉస్మానియా మెడికల్ కళాశాల ISO-9001-2015 గుర్తింపు దక్కింది. ఆ సంస్థ ప్రతినిధి శివయ్య గుర్తింపు పత్రాన్ని కళాశాల డా.నరేంద్ర కుమార్కు అందజేశారు. తెలంగాణలో రెండోసారి ISO గుర్తింపు తమ కళాశాలకు దక్కడం అభినందనీయం అన్నారు. వైస్ ప్రిన్సిపల్లు డా.శంకర్, డా.పద్మావతి, ఏడీ డా.శ్రీధర్ చారి మాజీ వైస్ ప్రిన్సిపల్ డా.టక్యుద్దీన్ ఉన్నారు.
Similar News
News December 20, 2025
బొల్లారంలో పూలు గుసగుసలాడేనని.. సైగ చేసేనని

అందమైన పూలు.. అలరించే రంగులు.. మనలను కనువిందు చేయనున్నాయి. కొత్త ఏడాదిలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇందుకు వేదిక కానుంది. JAN 3 నుంచి 9 రోజుల పాటు (11 వరకు) ఉ. 10 నుంచి రాత్రి 8 వరకు ఉద్యాన్ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకగా సాగుతున్నాయి. ప్రవేశం ఉచితమని.. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశం వినియోగించుకోవాలని రాష్ట్రపతి నిలయం ఆఫీసర్ రజినీ ప్రియ తెలిపారు.
News December 20, 2025
గండిపేట: నిఘా నేత్రాలకు పక్షవాతం!

₹కోట్లు కుమ్మరించి నిర్మించిన గండిపేట ల్యాండ్స్కేప్ పార్కులో భద్రత గాలిలో దీపమైంది! అక్కడి నిఘా నేత్రాల పనిచేయక అక్రమార్కుల ధాటికి చెరువు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు నిద్రలేచిన HMDA, కెమెరాల మరమ్మతులు, ఏడాది నిర్వహణ O&Mకు ₹14,62,079తో టెండర్లు పిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన, కాలుష్యం ముదిరిన తర్వాత ఇప్పుడు మరమ్మతులకు పూనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News December 20, 2025
మహానగరం ఫుల్ పిక్చర్ రేపే విడుదల?

మున్సిపాలిటీల విలీనం తర్వాత పునర్విభజనకు సంబంధించి మహానగర వ్యాప్తంగా 5,905 అభ్యంతరాలతో పాటు సలహాలు కూడా వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన గ్రేటర్ అధికారులు తుది నివేదికను రూపొందించారు. ఇందుకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ రేపు విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్కారు పెద్దలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


