News February 26, 2026

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

image

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు ప్రాతిపదికన 8 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.రాజారావు తెలిపారు. దరఖాస్తులను ఫిబ్రవరి 29 నుంచి మార్చి 5 వరకు ప్రిన్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి. అర్హతలు, మార్గదర్శకాలు తదితర వివరాలకు కళాశాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
SHARE IT

Similar News

News April 16, 2026

HYD: BREAKING.. మంగ్లీ కేసులో రమావత్‌ మధు అరెస్ట్

image

మైక్రో ఫైనాన్స్‌ మోసాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రమావత్‌ మధును సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే మధుపై సైబరాబాద్‌ పరిధిలోని పలు PSలలో మోసపూరిత కేసులు నమోదు కాగా, తాజా అరెస్టుతో దర్యాప్తులో మరింత వేగం పుంజుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మధును పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో మంగ్లీ సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

News April 16, 2026

HYD: ‘హౌస్ వైరింగ్’.. FREE ట్రైనింగ్

image

చిలుకూరులోని SBI- RSETI నిరుద్యోగ యువతకు ‘హౌస్ వైరింగ్’లో ఉచిత శిక్షణ ఇస్తోంది. ​10వ తరగతి ఉత్తీర్ణులైన 18- 50 ఏళ్లలోపు వారు ఈ కోర్సుకు అర్హులు. ​ఉచిత భోజనం, వసతి, ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తారు. ఆధార్, రేషన్‌కార్డ్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు.

News April 16, 2026

TG DEECET దరఖాస్తులు.. EDITకు ఛాన్స్

image

TG DEECET- 2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. MAR 15 నుంచి APR 15 వరకు జరిగిన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మొత్తం 32,611 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఈనెల 17, 18వ తేదీల్లో వెబ్‌సైట్ ద్వారా సవరించుకోవచ్చు. సందేహాల నివృత్తికి 8317567404 నంబర్‌ను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు. SHARE IT.