News September 7, 2024

ఊటుకూరులో పట్టపగలే దారుణ హత్య

image

ముదినేపల్లి మండలం ఊటుకూరులో శనివారం పట్టపగలే దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన పోసిన బాల కోటయ్య (55)ను మారణాయుధాలతో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ముదినేపల్లి పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News October 5, 2024

కృష్ణా: ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపు గడువు అక్టోబర్ ఒకటితో ముగియగా ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30లోపు ఫీజు చెల్లించాలని సూచించింది.

News October 5, 2024

నేడు పార్టీ అధిష్ఠానం వద్దకు కొలికపూడి

image

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై పలువురు చేసిన ఆరోపణలు నియోజకవర్గంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధిష్ఠానం ఆయన్ను వివరణ కోరనుంది. ఇదే సమయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు శావల దేవదత్‌‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొలికపూడిని ఇవాళ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని అధిష్ఠానం ఆదేశించింది.

News October 5, 2024

విజయవాడ: నేడు అన్నపూర్ణా దేవిగా అమ్మవారి దర్శనం

image

శరన్నవరాత్రులలో భాగంగా దుర్గమ్మ రేపు శనివారం శ్రీ అన్నపూర్ణదేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సృష్టి, స్థితి, లయకు కారణభూతమై, జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా అన్నపూర్ణదేవిని భక్తులు కొలుస్తారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్‌సిద్ధి‌ సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అన్నపూర్ణమ్మను పూజిస్తే ఆకలిదప్పుల బాధలు ఉండవని తెలిపారు.