News February 11, 2025

ఊట్కూర్: అదుపుతప్పిన స్కూటీ.. ఇద్దరికీ గాయాలు

image

ఊట్కూరు మండల పరిధిలోని కొల్లూరు గేట్ సమీపంలో స్కూటీ అదుపుతప్పి కిందపడి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్కూర్‌కు చెందిన గొల్ల కిష్టు తన స్కూటీపై మరో వ్యక్తితో కలిసి మక్తల్ వైపు వెళుతుండగా కొల్లూరు గేట్ సమీపంలో అతని స్కూటీ అదుపుతప్పి కింద పడింది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు వారిని 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

Similar News

News October 14, 2025

జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా సుజాత బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ అధికారినిగా సుజాత బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ సంబంధిత శాఖ అధికారినిగా విధులు నిర్వహిస్తున్న పరిమళ బదిలీ కావడంతో కొద్ది కాలంగా ఈ పోస్ట్ భర్తీ కాలేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిగా పని చేస్తున్న సుజాతకు ప్రమోషన్ లభించడంతో అధికారులు ఆమెను నెల్లూరుకు బదిలీ చేశారు.

News October 14, 2025

MCTEలో 18 పోస్టులు

image

క్యాడెట్స్ ట్రైనింగ్ వింగ్ ఆఫ్ మిలటరీ కాలేజీ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (MCTE)18 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎంఎస్, MSc, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 31 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

News October 14, 2025

‘ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోండి’

image

భద్రాద్రి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉపకార వేతనాల కోసం అప్లై చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి కోరారు. https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకుని కాపీలను ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీస్ S27లో సబ్మిట్ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి లక్షన్నర, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల లోపు ఆదాయం ఉండాలన్నారు.