News February 4, 2025
ఊట్కూర్: గ్రామ దేవత ఊర లక్ష్మమ్మ ఆలయంలో చోరీ

ఊట్కూరు మండల కేంద్రంలోని గ్రామదేవత ఊర లక్ష్మమ్మ ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. అర్చకులు భీమయ్య నిత్య పూజలో భాగంగా ఈరోజు ఉదయం ఆలయానికి వచ్చి చూడగా, గుర్తుతెలియని వ్యక్తులు ప్రధాన ద్వారం తాళం విరగొట్టి ఆలయంలోకి చొరబడి 4 పెద్ద గంటలు, హారతి పళ్లెం, హుండీ, అమ్మవారి వెండి వస్తువులు, 5 దీప జ్యోతులు అపహరించినట్లు తెలిపారు.
Similar News
News January 6, 2026
సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 54 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

<
News January 6, 2026
కోనసీమ: దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్లోఅవుట్ ఇదే..!

ఇరుసుమండ బ్లో అవుట్ నేపథ్యంలో ప్రజలు 1995 నాటి పాసర్లపూడి ఓఎన్‌జీసీ బావి అగ్నిప్రమాద ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్లోఅవుట్‌గా నమోదైన ఈ మంటలను ఆర్పేందుకు అమెరికా నిపుణుడు నీల్ ఆడమ్స్ బృందం రంగంలోకి దిగింది. అయితే ఓఎన్‌జీసీ అధికారులతో వ్యూహపరమైన విభేదాల వల్ల ఆయన మధ్యలోనే నిష్క్రమించారు. చివరకు 65 రోజుల తర్వాత అంతర్జాతీయ సంస్థల సాయంతో మంటలను అదుపు చేశారు.
News January 6, 2026
వరంగల్: రెన్యువల్ చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ జాప్యం!

వరంగల్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించి అనుమతుల పునరుద్ధరణ(రెన్యువల్) చేయడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జాప్యం చేస్తున్నారు. జిల్లాలో 180కి పైగా ప్రైవేట్ ఆస్పత్రిలో ఉండగా అందులో సగానికి పైగా రెన్యువల్ కాలేదు. దీంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు సీఎం సహాయ నిధి పథకం కింద వైద్యం అందించలేకపోతున్నారు. తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని ఆసుపత్రుల నిర్వాహకులు వాపోతున్నారు.


