News February 4, 2025
ఊట్కూర్: గ్రామ దేవత ఊర లక్ష్మమ్మ ఆలయంలో చోరీ

ఊట్కూరు మండల కేంద్రంలోని గ్రామదేవత ఊర లక్ష్మమ్మ ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. అర్చకులు భీమయ్య నిత్య పూజలో భాగంగా ఈరోజు ఉదయం ఆలయానికి వచ్చి చూడగా, గుర్తుతెలియని వ్యక్తులు ప్రధాన ద్వారం తాళం విరగొట్టి ఆలయంలోకి చొరబడి 4 పెద్ద గంటలు, హారతి పళ్లెం, హుండీ, అమ్మవారి వెండి వస్తువులు, 5 దీప జ్యోతులు అపహరించినట్లు తెలిపారు.
Similar News
News April 10, 2026
పెద్దపల్లి కలెక్టరేట్‌లో చలివేంద్రం ప్రారంభం

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని అదనపు కలెక్టర్ వేణు శుక్రవారం ప్రారంభించారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో బండి ప్రకాష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News April 10, 2026
రేపు నిజామాబాద్ జిల్లాకు RSS చీఫ్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ శనివారం NZB జిల్లాలో పర్యటించనున్నారు. RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాం పంత్ హెడ్గేవార్ పూర్వీకుల స్వగ్రామమైన జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తిలో నిర్మించిన కేశవ స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భాగవత్ ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు కంద కుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
News April 10, 2026
HDFC వినియోగదారులకు అలర్ట్!

సిస్టమ్ అప్‌గ్రేడ్ వల్ల రేపు 2.30AM నుంచి 6.30AMవరకు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు HDFC ప్రకటించింది. అయితే ఉదయం 5 తర్వాత UPI లావాదేవీలు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొంది. డెబిట్ కార్డుల ద్వారా రూ.5వేల వరకూ నగదు విత్‌డ్రాలు, ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. Zapp వాలెట్ సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతాయని తెలియజేస్తూ వినియోగదారులను అలర్ట్ చేసింది.


