News March 16, 2025
ఊట్కూర్: బాల్య వివాహ ప్రయత్నం అడ్డగింత

ఊట్కూర్ మండల పరిధిలోని ఓ గ్రామంలో బాలిక (17)కు బాల్య వివాహం జరిపించాలని యత్నించగా అధికారులు శనివారం అడ్డుకున్నారు. సోషల్ వర్కర్ శ్రవణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను మరో గ్రామానికి చెందిన యువకుడు (23)తో బాల్య వివాహం జరిపించడానికి వారి కుటుంబ సభ్యులు యత్నించగా బాలల సంరక్షణ అధికారులు అశ్విని, శ్రవణ్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బాలికను సఖి కేంద్రానికి తరలించినట్లు తెలిపారు.
Similar News
News November 17, 2025
తిరుపతి: ఇప్పటి వరకు 231 మంది అరెస్ట్

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు రెడ్ శాండిల్ టాస్క్ఫోర్స్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పలు కేసులు కేసులు నమోదు చేశారు. 231 మందిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. దాదాపు 1,778 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు వినియోగించిన 57వాహనాలను సీజ్ చేసినట్లు రెడ్ శాండిల్ టాస్క్ఫోర్స్ తిరుపతి ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.
News November 17, 2025
రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 500% టారిఫ్!

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాల కట్టడికి అమెరికా సెనేట్ కొత్త బిల్లు తెచ్చింది. అలాంటి దేశాలపై 500% టారిఫ్ విధించేలా తెచ్చే బిల్లును సెనేటర్ లిండ్సే ప్రతిపాదించారు. దీనికి ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతిచ్చారు. దీంతో భారత్, చైనా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించినట్లు సమాచారం.
News November 17, 2025
PPP మోడల్లో ఆటోనగర్ బస్టాండ్ అభివృద్ధి.. ఉయ్యూరు, గుడివాడ కూడా?

విజయవాడ ఆటోనగర్ బస్టాండ్ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 10 ప్లాట్ఫామ్స్, వ్యాపార సముదాయాలు ఉండేలా ప్లాన్ సిద్ధం చేశారు. అనుమతులు రాగానే కాంట్రాక్టర్కు పనులు అప్పగిస్తారు. రద్దీగా ఉన్న PNBSకి ప్రత్యామ్నాయంగా ఆటోనగర్ బస్టాండ్ను వినియోగించుకునే యోచనలో ఉన్నారు. ఉయ్యూరు, గుడివాడ బస్టాండ్ల అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.


