News March 16, 2025
ఊట్కూర్: బాల్య వివాహ ప్రయత్నం అడ్డగింత

ఊట్కూర్ మండల పరిధిలోని ఓ గ్రామంలో బాలిక (17)కు బాల్య వివాహం జరిపించాలని యత్నించగా అధికారులు శనివారం అడ్డుకున్నారు. సోషల్ వర్కర్ శ్రవణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను మరో గ్రామానికి చెందిన యువకుడు (23)తో బాల్య వివాహం జరిపించడానికి వారి కుటుంబ సభ్యులు యత్నించగా బాలల సంరక్షణ అధికారులు అశ్విని, శ్రవణ్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బాలికను సఖి కేంద్రానికి తరలించినట్లు తెలిపారు.
Similar News
News March 5, 2026
దిలావర్పూర్: జాతీయ స్థాయిలో స్నేహితకు కాంస్య పతకం

దిలావర్పూర్ మండల కేంద్రానికి చెందిన చిట్టి స్నేహిత జాతీయస్థాయి కరాటే పోటీల్లో కాంస్య పతకం సాధించి ఊరికి పేరు తెచ్చింది. జామ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఈమె, హనుమకొండలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్-2026లో ప్రతిభ చాటింది. స్నేహిత సాధించిన విజయానికి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని విద్యార్థినిని అభినందించారు.
News March 5, 2026
10 సార్లు సీఎం.. ఇక శకం ముగిసినట్లే!

బిహార్‌లో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన రికార్డు నితీశ్ పేరిట ఉంది. ఏకంగా 10 సార్లు ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి 2000 సం.లో కేవలం 7 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2005, 10, 15 (2 సార్లు), 17, 20, 22, 24, 25లో CM కుర్చీ ఎక్కారు. OBCలు, మహిళల మద్దతుతో పాటు వివిధ పార్టీలతో పొత్తుల ద్వారా ఎక్కువ కాలం సీఎంగా కొనసాగారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్‌లో ఆయన శకం ముగిసినట్లే భావించాలి.
News March 5, 2026
కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 5,236 మంది హాజరు.!

కడప జిల్లాలో గురువారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ తెలుగు, హిందీ, ఉర్దు పరీక్షలు నిర్వహించారు. నేడు 5,783 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 5,326 మంది విద్యార్థులు హాజరయ్యారు. 711 మంది గైర్హాజరయ్యారు. తెలుగు 5,086 మంది, హిందీ 68 మంది, ఉర్దు పరీక్ష 82 మంది రాశారు. డీఈఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను నిర్వహించారు.


