News February 8, 2025
ఊట్కూర్: ‘మాకు అల్పాహారం అరటి పండేనా.?’

ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం అందిస్తోంది. ఇందుకు ఒక్కో విద్యార్థికి రూ.15 ఖర్చు చేస్తోంది. కాగా ఊట్కూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు గత కొద్ది రోజులుగా ఒక అరటి పండు లేదా రూ.5 విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నారని, ఇవి తమ ఆకలి తీర్చడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మెనూ ప్రకారం అల్పాహారం ఇవ్వడం లేదంటున్నారు.
Similar News
News December 3, 2025
ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆక్టోపస్ ‘మాక్ డ్రిల్’

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆక్టోపస్ డెల్టా టీమ్, గుంటూరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇందులో పాల్గొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత, ప్రజా రక్షణ కోసమే దీనిని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
News December 3, 2025
124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<
News December 3, 2025
చిత్తూరు: డిప్యూటీ MPDOలకు కీలక బాధ్యతలు

చిత్తూరు జిల్లాలో సచివాలయాలను పర్యవేక్షించేలా డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తున్నారు. మండలంలోని 31 మండలాల్లో 504 గ్రామ సచివాలయాలు, 108 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇప్పటికే 27మంది డిప్యూటీ ఎంపీడీవోలు విధుల్లో చేరారు. సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా వీరు పర్యవేక్షణ చేయనున్నారు.


